Telangana: జిమ్నాస్టిక్స్ కోచ్ బ్రిజేష్ కిషోర్ మృతి

  • కొంత కాలంగా ‘కేన్సర్’తో బాధపడుతున్న బ్రిజేష్ కిషోర్
  • హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో మృతి
  • తెలంగాణ క్రీడా శాఖ మంత్రి సంతాపం
గత కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ప్రపంచ జిమ్నాస్టిక్స్ కోచ్ బ్రిజేష్ కిషోర్ మృతి చెందారు. హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న తెలంగాణ క్రీడా శాఖ మంత్రి పద్మారావు, ఆ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తమ సంతాపం తెలిపారు.

ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. బ్రిజేష్ కుమార్ కుటుంబానికి తమ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రపంచ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో రజత పతకం సాధించిన అరుణా రెడ్డికి ఆయన కోచ్ గా వ్యవహరించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణలో జిమ్నాస్టిక్స్ క్రీడాభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Telangana
gymnasticks
brijesh kishore

More Telugu News