Andhra Pradesh: మోదీ అసలు స్వరూపాన్ని చంద్రబాబు తెలియజెప్పారు!: ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

  • తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడే పార్టీ టీడీపీ
  • కేంద్రంపై తిరుగులేని పోరాటం చేస్తున్నాం
  • ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడే పార్టీ టీడీపీ అని, ప్రధాని నరేంద్ర మోదీ అసలు స్వరూపాన్ని ఢిల్లీ వేదికగా చంద్రబాబు తెలియజెప్పారని టీడీపీ నేత, ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై తిరుగులేని పోరాటం చేస్తున్నామని, తెలుగు ప్రజలపై కక్ష పూరిత వైఖరిని నిరసిస్తూ తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. టీడీపీ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని, ఎల్లుండి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు.
Andhra Pradesh
kalva srinivasulu

More Telugu News