avanthi srinivas: పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో ధర్నా చేస్తూ.. కళ్లు తిరిగి పడిపోయిన అవంతి శ్రీనివాస్.. ఆసుపత్రికి తరలింపు

షార్ట్స్‌లో చూడండి
రాజ్యసభలో దాదాపు 4 గంటల నుంచి టీడీపీ సభ్యులు తమ నిరసన తెలుపుతోన్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా టీడీపీ లోక్‌సభ సభ్యులు కూడా పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ధర్నా చేస్తున్నారు. అయితే, ఈ ఆందోళనలో పాల్గొన్న ఎంపీ అవంతి శ్రీనివాస్ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు. ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. బీపీ పడిపోవడం వల్ల కళ్లు తిరిగి పడిపోయారని చెప్పారు. వెంటనే ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు, రాజ్యసభలో బైఠాయించిన టీడీపీ సభ్యులతో రాజ్యసభ సెక్రటరీ జనరల్ చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌తో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్ గోయల్ కూడా చర్చలు జరిపి విఫలమైన విషయం తెలిసిందే.
Go Back to Shorts
avanthi srinivas
parliament

More Telugu News