steeve smith: స్మిత్ పై గంగూలీ సానుభూతి!

  • స్మిత్ అసాధారణ క్రికెటర్
  • అతను ఈ తప్పు చేశాడంటే నమ్మలేకపోతున్నా
  • స్మిత్ ను ఓ మోసగాడిగా చూడొద్దన్న గంగూలీ
బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ పై టీమీండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సానుభూతి వ్యక్తం చేశారు. స్మిత్ అసాధారణ క్రికెటర్ అని, అతను ఈ తప్పు చేశాడంటే నమ్మలేకపోతున్నానని అన్నారు. స్మిత్ ను ఓ మోసగాడిగా చూడొద్దని, అతను చేసింది మోసం అనడం సరికాదంటూ గంగూలీ అభిప్రాయపడ్డారు. కాగా, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్ లో ఆస్ట్రేలియా టీమ్ పథకం ప్రకారం బాల్ ట్యాంపరింగ్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్, వార్నర్ పై ఏడాది, బాన్ క్రాఫ్ట్ పై తొమ్మిది నెలల నిషేధం విధించడం తెలిసిందే.
steeve smith
ganguly

More Telugu News