Tollywood: టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమౌళి మృతి

  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమౌళి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • టాలీవుడ్ కు చెందిన పలువురి సంతాపం
టాలీవుడ్ సీనియర్ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ చంద్రమౌళి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమౌళి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. చంద్రమౌళి మృతిపై టాలీవుడ్ కు చెందిన పలువురు తమ సంతాపం తెలిపారు. 

చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రమౌళి స్వస్థలం ఏర్పేడు మండలంలోని మునగలపాలెం. 1971లో విడుదలైన ‘అంతా మన మంచికే’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన పరిచయమయ్యారు. నాటి అగ్రనటుల సినిమాలతో పాటు నేటి హీరోల చిత్రాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో ఆయన నటించారు. సుమారు 200 సినిమాల్లో ఆయన నటించారు.  
Tollywood
chandramouli

More Telugu News