Rajya Sabha: రాజ్యసభ నుంచి బయటకు రామంటోన్న టీడీపీ సభ్యులు.. మార్షల్స్‌ను పిలిపించిన సిబ్బంది

  • సభలోంచి బయటకు వెళ్లాలని కోరిన రాజ్యసభ సిబ్బంది 
  • వాగ్వివాదం.. బయటకు పంపేందుకు తీవ్ర ప్రయత్నం
  • ప్రత్యేక హోదా కావాలని టీడీపీ సభ్యుల నినాదాలు
రాజ్యసభలో గందరగోళం చెలరేగడంతో సభను సజావుగా కొనసాగించే వీలు లేదంటూ డిప్యూటీ ఛైర్మన్ కురియన్‌ సభను రేపటికి వాయిదా వేసినప్పటికీ టీడీపీ సభ్యులు సభలోనే కూర్చొని నిరసన తెలుపుతోన్న విషయం తెలిసిందే. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లేది లేదని టీడీపీ సభ్యులు తేల్చి చెబుతున్నారు. దీంతో రాజ్యసభ సిబ్బందికి, సభ్యులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

మార్షల్స్‌ను పిలిపించిన సిబ్బంది టీడీపీ సభ్యులను బయటకు పంపేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, విభజన హామీలు నెరవేర్చాల్సిందేనని టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. రేపు వారు రాష్ట్రపతిని కలిసే యోచనలో ఉన్నారు.

Rajya Sabha
Telugudesam

More Telugu News