Revanth Reddy: రేవంత్ రెడ్డి ఒక జోకర్ .. బ్రోకర్ .. ఐటమ్ సాంగ్ డ్యాన్సర్ : ఎమ్మెల్యే ఎర్రబెల్లి

  • నాడు రేవంత్ ని  తానే జైల్లో పెట్టించానని ఆయన చెబుతున్నారు
  • టీడీపీలో ఉన్నప్పుడే ఈ విషయం ఎందుకు చెప్పలేదు?
  • రాష్ట్రంలోని అభివృద్ధి కాంగ్రెస్ నాయకులకు కనబడట్లేదా?
కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. వరంగల్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు రేవంత్ రెడ్డిని తానే జైల్లో పెట్టించానని ఆయన చెప్పారని, మరి, జైలు నుంచి తిరిగి వచ్చాక రేవంత్ రెడ్డి తన ఇంటికి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. అసలు నాడు టీడీపీలో ఉన్నప్పుడే ఈ విషయం ఎందుకు బయటపెట్టలేదంటూ రేవంత్ రెడ్డిపై ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘రేవంత్ రెడ్డి ఒక జోకర్..బ్రోకర్..ఐటమ్ సాంగ్ డ్యాన్సర్’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, పూర్తయిన ప్రాజెక్టులు కాంగ్రెస్ నేతలకు కనపడటం లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించలేదని, ఆ ఘనత తమ ప్రభుత్వానికే చెందుతుందని, తమ పాలనలో పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. 
Revanth Reddy
Errabelli

More Telugu News