rajanikanth: సెన్సార్ పూర్తిచేసుకున్న రజనీ 'కాలా'

  • విడుదలకి ముస్తాబవుతోన్న 'కాలా'
  • యు/ఎ సర్టిఫికెట్ మంజూరు 
  • త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన
రజనీకాంత్ కథానాయకుడిగా రంజిత్ దర్శకత్వంలో 'కాలా' సినిమా రూపొందింది. ధనుష్ నిర్మించిన ఈ సినిమాలో రజనీ సరసన హుమా ఖురేషి కథానాయికగా నటించింది. మాఫియా డాన్ గా రజనీకాంత్ నటించిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది.

తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితం చెప్పారు. అందుకు సంబంధించిన పోస్టర్లను కూడా వదిలారు. అయితే తాజాగా విడుదల తేదీ విషయంపై క్లారిటీ రాలేదు. త్వరలోనే విడుదల తేదీ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరిస్తున్నారు. టైటిల్ .. రజనీ లుక్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తున్నాయనీ, రజనీ ఖాతాలో మరో హిట్ చేరడం ఖాయమనే అభిప్రాయాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.            
rajanikanth

More Telugu News