Chandrababu: ఓ పత్రిక నన్ను వెనక్కులాగే ప్రయత్నం చేస్తోంది: చంద్రబాబు

  • ఏపీ ప్రజల కోసమే ఢిల్లీకి వెళ్లాను
  • కేంద్ర ప్రభుత్వ మోసాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశా
  • బీజేపీ నమ్మించి మోసం చేసింది
  • నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టేది లేదు
ఓ పత్రిక తనను వెనక్కులాగే ప్రయత్నం చేస్తోందని, నిజానికి ఆ పత్రిక రాష్ట్రాన్నే వెనక్కు లాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఏపీ ప్రజల కోసమే తాను ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ మోసాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశానని చెప్పారు.

తమ పోరాటం చివరి వరకూ ఆగదని, న్యాయం కోసం పోరాడితే తనపై ఎదురుదాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆ నాడు తాను హైదరాబాద్‌ని డెవలప్ చేశానని, ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని చెప్పారు. బీజేపీ నమ్మించి మోసం చేసిందని, నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టేది లేదని అన్నారు. 
Chandrababu
YSRCP
BJP
Telugudesam

More Telugu News