stalin: కావేరి ఆందోళనలు.. స్టాలిన్ అరెస్ట్

  • కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర బంద్ కు డీఎంకే పిలుపు
  • అన్నాశాలైలో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న స్టాలిన్
  • రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది పోలీసుల మోహరింపు
కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో డీఎంకే ఇచ్చిన పిలుపుతో తమిళనాడు వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. నిరసనల్లో భాగంగా చెన్నైలోని బీచ్ రోడ్ కు భారీ ఎత్తున నిరసనకారులు చేరుకున్నారు. అన్నాశాలైలో జరిగిన భారీ నిరసన ప్రదర్శనలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని, అక్కడ నుంచి తరలించారు.

మరోవైపు వెల్లూరులో 15 ప్రభుత్వ, ప్రైవేటు బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది పోలీసులను రంగంలోకి దించారు. చెన్నైలో 15వేల మంది పోలీసులు మోహరించారు.
stalin
dmk
Tamil Nadu
bandh
kaveri management board

More Telugu News