ఆ హీరోయిన్ నా కారు తిరిగి ఇవ్వడం లేదు: వ్యాపారవేత్త ఫిర్యాదు
- కిమ్ శర్మపై కేసు నమోదు చేసిన రాజస్థాన్ వ్యాపారవేత్త దిలీప్ కుమార్
- కిమ్ ఇంటిదగ్గర కారు పార్క్ చేసుకునే వాడినన్న దిలీప్ కుమార్
- 2017 లో కేసు నమోదు చేసిన దిలీప్
ఏడాది క్రితం కిమ్ తన కారును వాడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, దీంతో ఆమెను ప్రశ్నించగా, ఆ కారును తన భర్త తనకు ఇచ్చాడని చెబుతూ ఆమె వాపస్ చేసేందుకు నిరాకరించిందని, దీంతో తాను 2017 సెప్టెంబర్ లో దీనిపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. అప్పట్లో దీనిపై పోలీసులు కిమ్ శర్మకు బదులుగా ఆమె భర్త అలీ పుంజానీపై కేసు నమోదు చేశారని, కిమ్ శర్మ పేరిట కేసు రిజిస్టర్ చేయాలని ఆయన పోలీసులను కోరారు.