Nalgonda District: ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసి.. నడిరోడ్డుపై తండ్రిని హతమార్చిన కొడుకులు!

  • గోవిందరెడ్డితో కుమారులు అంజిరెడ్డి, రమణారెడ్డిలకు ఆస్తి వివాదం
  • అల్లుడు సైదురెడ్డితో కలసి బ్యాంకుకు వెళ్లిన గోవిందరెడ్డి
  • నడిరోడ్డుపై దారుణంగా హతమార్చిన కొడుకులు
పట్టపగలు అంతా చూస్తుండగా కన్న తండ్రిపై కొడుకులు కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చిన దారుణ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియ గ్రామానికి చెందిన చందారెడ్డి గోవిందరెడ్డి తన అల్లుడు కూనిరెడ్డి సైదురెడ్డితో కలిసి బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో వారిపై కర్రలు, ఇనుప రాడ్లతో గోవింద రెడ్డి కుమారులు అంజిరెడ్డి, రమణారెడ్డిలు విరుచుకుపడ్డారు. వారు తేరుకునేలోపు తీవ్రంగా దాడి చేసి, పరారయ్యారు.

 దీంతో వారి తండ్రి గోవిందరెడ్డి అక్కడికక్కడే దుర్మరణం పాలు కాగా, బావ సైదురెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, తీవ్రంగా గాయపడిన సైదురెడ్డిని ఆసుపత్రికి తరలించారు. రక్తపు మడుగులో పడిఉన్న గోవింద రెడ్డి మృతదేహం పక్కన ఆంధ్రా బ్యాంకు పాస్‌ బుక్ పడి ఉందని తెలిపారు. ఆస్తిగొడవలే వివాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామని, నిందితులను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Nalgonda District
anumula
murder

More Telugu News