suicide: అక్క కలలోకి వచ్చి తనను స్వర్గానికి రమ్మంటోందని యువతి ఆత్మహత్య

  • మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన
  • గతేడాది ఆత్మహత్య చేసుకున్న అక్క జ్యోతి
  • తనను రమ్మని పిలుస్తోందంటూ పదేపదే చెప్పిన చెల్లి ఆకాంక్ష 
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతి సాధించిన ఈ కాలంలోనూ ఎంతో మంది యువత శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోలేక జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. మూఢ నమ్మకాల్లోంచి బయటపడలేక కొందరు ప్రాణాలు తీసుకుంటోన్న ఘటనలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇటువంటి ఘటనే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.

అజయ్‌ కుమార్‌ అనే వ్యక్తికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారిలో జ్యోతి అనే యువతికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె కొన్ని సమస్యల వల్ల గతేడాది ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆమె చెల్లెలు ఆకాంక్ష ఆ ఇద్దరు పిల్లల బాగోగులని చూసుకుంటోంది. అయితే, ప్రతిరోజు తన అక్క జ్యోతి తన కలలోకి వస్తోందని, తనను రమ్మని పిలుస్తోందని ఆకాంక్ష అంటూ ఉండేది. చివరకు ఆమె కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
suicide
girl
Maharashtra

More Telugu News