Nani: తొలిసారి నాగార్జునతో కలిసి షూటింగ్‌లో పాల్గొన్న నాని!

షార్ట్స్‌లో చూడండి
ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో తన సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లే సమయంలో చిన్న పిల్లాడిలా ఎంతో ఉత్సాహంగా ఫీలయ్యానని నేచురల్ స్టార్‌ నాని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. ఎందుకంటే తాను తొలిసారిగా కింగ్ నాగార్జునతో కలిసి షూటింగ్ లో పాల్గొన‌్నానని, ఆయనకు స్వాగతమని ట్వీట్ చేశాడు.

షూటింగ్‌కు సంబంధించిన ఓ ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. కాగా, నాగార్జున, నాని కాంబినేషన్‌లో వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మాత సీ అశ్వనిదత్ ఓ సినిమా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. 
Go Back to Shorts
Nani
Nagarjuna

More Telugu News