Lok Sabha: ఒకేసారి లోక్ సభ, శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థులకు చేదువార్త!

  • ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకూడదంటూ ‘పిల్’ 
  • మద్దతు తెలుపుతూ ‘సుప్రీం’కు నివేదించిన ఎన్నికల సంఘం 
  •  రెండు చోట్ల గెలిచి ఒక స్థానాన్ని వదిలివెళ్లడం అన్యాయమేనన్న ఎన్నికల సంఘం
ఒకేసారి లోక్ సభ, శాసనసభలకు పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ఇకపై ఆ అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఒక్కో అభ్యర్థి ఒక్కో స్థానం కోసం మాత్రమే పోటీ చేయాలన్న ప్రతిపాదనలకు భారత ఎన్నికల సంఘం మద్దతు తెలుపుతున్నట్టు సుప్రీంకోర్టుకు నివేదించింది.

కాగా, ఒక అభ్యర్థి ఒక స్థానం కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా చూడాలని కోరుతూ ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీనిపై భారత ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించిన అభ్యర్థులు ఒక నియోజకవర్గాన్ని వదిలి మరో నియోజకవర్గానికి వెళ్లడమంటే ఓటర్లకు అన్యాయం చేయడమేనని ఎన్నికల సంఘం పేర్కొంది.
Lok Sabha
assembly

More Telugu News