Vijay Sai Reddy: విజయసాయిలాంటి వారి కోసం ఓ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి: డొక్కా

  • రాజకీయాల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడరాదు
  • తప్పుగా మాట్లాడే నేతలకు ట్రైనింగ్ ఇవ్వాలి
  • ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరావాలి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడటం రాజకీయాల్లో మంచిది కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ సూచించారు. మాటతీరు మార్చుకోవాలని అన్నారు. రాజకీయాల్లో ఉంటూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించే విజయసాయిరెడ్డి లాంటివారికి ఒక ట్రైబ్యునల్ ప్రారంభించాలని, అందులో ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలా మాట్లాడాలో 6 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పారు. ఏ పార్టీకి చెందిన నేతలు తప్పుగా మాట్లాడినా, వారందరినీ ట్రైనింగ్ కు పంపాలని అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే... సరైన సమయంలో ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారని తెలిపారు. స్పెషల్ స్టేటస్ అంశాన్ని చంద్రబాబు దేశ స్థాయికి తీసుకెళ్లారని చెప్పారు.
Vijay Sai Reddy
dokka manikya vara prasad
Chandrababu
Nara Lokesh

More Telugu News