Jagan: జగన్ తో భేటీ అయిన ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్

  • చంద్రబాబు గట్టిగా అడిగి ఉంటే హోదా వచ్చేదని చెప్పిన జగన్
  • బాబు ఢిల్లీకి వెళ్లింది హోదా కోసం కాదు
  • హోదా కోసం పోరాడేవారికి వైసీపీ అండగా ఉంటుంది
వైసీపీ అధినేత జగన్ తో ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు చలసాని శ్రీనివాసరావు, తాడి సురేష్, కొండా నర్సింగరావు, సదాశివరెడ్డి, అప్పలనాయుడు, మల్లికార్జున్ తదితరులు భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, ఢిల్లీ పరిణామాలపై చర్చించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, హోదాపై ఇప్పటికే తమ కార్యాచరణను ప్రకటించామని చెప్పారు. త్వరలోనే మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిద్దామని ప్రత్యేక హోదా సాధన సమితి నేతలతో అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా అడిగి ఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని చెప్పారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లింది హోదా కోసం కాదని, మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకే అని తెలిపారు. హోదా కోసం పోరాడేవారందరికీ వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు. హోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 
Jagan
chalasani sreenivas
special status

More Telugu News