Pawan Kalyan: పవన్ కల్యాణ్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు: జలీల్ ఖాన్
రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క సీటు కూడా రాదని టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. బీజేపీకి అనుకూలంగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీపై పవన్ చేసిన ఆరోపణలను ప్రజలు ఎవరూ నమ్మడం లేదని చెప్పారు. ఉమ్మడి ఏపీలో రాజశేఖరరెడ్డి చేసిన అవినీతి కూడా ప్రతి ఒక్కరికి తెలుసని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నది టీడీపీనే అని చెప్పారు.