chennai super kings: రెండు రోజుల ముందే ముంబై చేరుకున్న చెన్నై జట్టు!

  • ఏప్రిల్ 7న ప్రారంభం కానున్న ఐపీఎల్
  • తొలి మ్యాచ్ లో తలపడనున్న ముంబై-చెన్నై జట్లు
  • ముంబై చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు
  రెండేళ్ల నిషేధం ముగించుకుని ఐపీఎల్ లో ఆడనున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, ఐపీఎల్ ప్రారంభానికి రెండు రోజుల ముందే ముంబై చేరుకుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న ధోనీ ఢిల్లీ నుంచి నేరుగా ముంబై చేరుకోగా, నిన్నటి వరకు చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేసిన సహచరులు కూడా ముంబై చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఒక వీడియోను సీఎస్కే జట్టు యాజమాన్యం ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ నెల 7న ఐపీఎల్ ప్రారంభం కానుండగా, ఈ వేడుకలకు కేవలం రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే హాజరుకానున్నారు. ఇతర జట్ల కెప్టెన్స్ వివిధ కారణాల వల్ల రాలేకపోతున్నారు. అనంతరం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఢీ కొంటుంది. నేటి నుంచి ఇరు జట్ల ఆటగాళ్లు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నారు.
chennai super kings
mumbai indians
ipl

More Telugu News