october movie: బాలీవుడ్ హీరోను వెయిటర్ అనుకున్న పర్యాటకులు

  • వరుణ్ ధావన్, బనితా సంధు ప్రధాన పాత్రల్లో 'అక్టోబర్' సినిమా
  • హోటల్‌ మేనేజ్‌ మెంట్ స్టూడెంట్‌‌ పాత్రలో వరుణ్ ధావన్
  • ఢిల్లీలోని స్టార్ హోటల్ లో చిత్రీకరణ
బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ ను ఓ స్టార్ హోటల్ లో పర్యాటకులు వెయిటర్ గా పొరబడిన ఘటన ‘అక్టోబర్’ సినిమా షూటింగ్ సందర్భంగా చోటుచేసుకుంది. వరుణ్ ధావన్, బనితా సంధు ప్రధాన పాత్రల్లో 'అక్టోబర్' సినిమాను శూజిత్‌ సర్కార్‌ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ హోటల్‌ మేనేజ్‌ మెంట్ స్టూడెంట్‌‌ పాత్రలో కనిపిస్తాడు.

ఇందుకోసం ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ ను ఎంచుకున్న చిత్రయూనిట్, అక్కడ షూటింగ్ నిర్వహిస్తుండగా, పాత్రానుగుణంగా కనిపించేందుకు.. హోటల్‌ లో మేనేజ్‌ మెంట్‌ విద్యార్థి ఏం చేస్తాడో అన్ని పనుల్ని దర్శకుడు చేయించాడు. వీటి రిహార్సల్స్ సమయంలో అక్కడికి చేరుకున్న విదేశీ పర్యాటకులు తనను నిజంగానే వెయిటర్ గా భావించారని వరుణ్ తెలిపాడు. ‘అక్టోబర్‌’ సినిమా ఏప్రిల్ 13న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ మంచి టాక్‌ అందుకుంది.
october movie
varun dhavan
banita sandhu
shujith sarkar

More Telugu News