prabhas: ప్రభాస్ తో సుకుమార్ మూవీ .. మరో సంచలనానికి ముహూర్తం పెట్టనున్నాడా?

షార్ట్స్‌లో చూడండి
'రంగస్థలం' భారీ విజయాన్ని నమోదు చేయడంతో .. దర్శకుడిగా సుకుమార్ మరో మెట్టు పైకి ఎక్కారు. సుకుమార్ సినిమాలో కంటెంట్ ఎంత పక్కాగా వుంటుందనే విషయం మరో మారు ఆడియన్స్ కి అర్థమైంది. దాంతో ఆయన తదుపరి సినిమా ఏ హీరోతో వుండనుందా అనే విషయంపై అందరూ ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తో ఉండొచ్చుననే ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి అలాంటిదేం లేదని సుకుమార్ చెప్పారు.

కథను బట్టి హీరోను ఎంచుకుంటానని సుకుమార్ అన్నారు. ఆయన తన తదుపరి సినిమాను ప్రభాస్ తో చేయవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ .. ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని ఉందనడమే ఈ ప్రచారానికి బలాన్ని ఇస్తోంది. ప్రభాస్ తో సుకుమార్ ఒకటి రెండు సార్లు చర్చలు జరపడం కూడా అయిందని అంటున్నారు. సుకుమార్ తో చేయడానికి ప్రభాస్ కూడా ఆసక్తిని కనబరుస్తున్నాడని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. 
Go Back to Shorts
prabhas
sukumar

More Telugu News