Lok Sabha: అర నిమిషంలోనే లోక్ సభను వాయిదా వేసి వెళ్లిపోయిన సుమిత్రా మహాజన్

  • లోక్ సభలో ఈ రోజు కూడా సేమ్ సీన్
  • సభను మధ్యాహ్నం 12 వరకు వాయిదా వేసిన స్పీకర్
  • కొనసాగుతున్న రాజ్యసభ
లోక్ సభలో ఈ రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఛైర్లో కూర్చునే సమయానికే అన్నాడీఎంకే ఎంపీలు వెల్ లోకి చేరుకున్నారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ, కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలో, సభను కొనసాగించడానికి స్పీకర్ ఏమాత్రం ఆసక్తి చూపలేదు. అర నిమిషంలోనే సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసి, వెళ్లిపోయారు. మరోవైపు రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ఛైర్మన్ వెంకయ్యనాయడు ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. 
Lok Sabha
Rajya Sabha

More Telugu News