palle: చంద్రబాబు ఢిల్లీకి వెళితే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి: పల్లె రఘునాథ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళితే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుకు ఢిల్లీలో ఘ‌న‌స్వాగ‌తం లభించిందని, అది చూసి వైసీపీ నేతలు ఓర్వలేక‌పోతున్నారని అన్నారు.

చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లపై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి, విజయ సాయిరెడ్డికి తమ ఆస్తులు ప్రకటించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. విజయ సాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి చేస్తోన్న వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.
Go Back to Shorts
palle
YSRCP
Telugudesam

More Telugu News