raoja ramani: ఎవరికైనా .. ఎప్పుడైనా చిరంజీవి నుంచే ఫస్టు కాల్ వస్తుంది: రోజా రమణి

  • చిరంజీవిలో ఓ గొప్పగుణం వుంది 
  • ఎవరికైనా మంచి జరిగితే సంతోషిస్తారు 
  • ఎవరైనా బాధలో వుంటే స్పందిస్తారు
తాజాగా రోజా రమణి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, చిరంజీవితో తమ ఫ్యామిలీకి గల అనుబంధం గురించి ప్రస్తావించారు. "చిరంజీవిలో ఓ గొప్ప గుణం వుంది .. ఎవరిదైనా బర్త్ డే అయినా .. మ్యారేజ్ డే అయినా .. ఏదైనా అవార్డు వచ్చినా ఫస్టు కాల్ ఆయన నుంచే వస్తుంది. ఆయనే ముందుగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తారు .. అభినందిస్తారు"

"అలాగే ఎవరికైనా ఏదైనా జరిగినా .. ఏదైనా బాధలో వున్నా నాకు తెలిసి ఫస్టు కాల్ ఆయన నుంచే వస్తుంది. ఎవరినైనా చూసి ఏదైనా మంచి నేర్చుకోవాలనుకుంటే, ఈ విషయంలో చిరంజీవి గారిని చూసి నేర్చుకోవచ్చు .. నిజంగా ఆయన చాలా గ్రేట్" అంటూ చెప్పుకొచ్చారు.    
raoja ramani
ali

More Telugu News