Nayanatara: అనుష్క పాత్రలో నయనతార....?

  • తమిళ 'పరి' చిత్రానికి నయనతార పేరు పరిశీలన
  • ప్రస్తుతం సైరా చిత్రంలో నటిస్తున్న మలయాళ కుట్టి
  • మార్చి 3న రిలీజైన అనుష్క 'పరి' చిత్రానికి ఆదరణ
డోరా, మాయ వంటి హారర్ చిత్రాల్లో నటించి మెప్పించిన కేరళ ముద్దుగుమ్మ నయనతార ఖాతాలో మరో హారర్ నేపథ్యమున్న చిత్రం చేరనుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అసలు విషయమేమిటంటే....హిందీలో అనుష్క శర్మ నటించి నిర్మించిన 'పరి' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనుష్క పాత్రలో నయనతార పేరును దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్నారట.

ఆమైతేనే ఈ పాత్రకు సూటవుతుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తోంది. కాగా, అనుష్క విభిన్న పాత్రలో నటించిన 'పరి' చిత్రం మార్చి 3న విడుదలైన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా అనుష్క నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు.
Nayanatara
Anushka Sharma
Kollywood
Paari
Bollywood

More Telugu News