rajamouli: రాజమౌళి మూవీలో చేయాలని వుంది: 'బిగ్ బాస్' ఆదర్శ్

  • నా అభిమాన దర్శకులు రాజమౌళి 
  • 'బాహుబలి'ని తెరకెక్కించిన తీరు అద్భుతం 
  • ఆయనతో కలిసి పనిచేయడమే అదృష్టం
తెలుగు సినిమాల్లో నటిస్తూ .. సరైన పాత్ర కోసం ఆదర్శ్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఐ డ్రీమ్స్ తో ఆయన మాట్లాడుతూ, తన మనోభావాలను ఆవిష్కరించారు. " ఏ దర్శకుడి సినిమాలో చేస్తే నటుడిగా ఈ జీవితం ధన్యమని భావిస్తారు?" అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అప్పుడాయన స్పందిస్తూ .. "సందేహంలేదు .. ఈ ప్రశ్నకి సమాధానంగా నేను రాజమౌళి పేరే చెబుతాను" అన్నారు.

"తెలుగు సినిమాను శిఖరస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడాయన. అలాంటి దర్శకుడితో కలిసి పనిచేయడమనేది ఒక అదృష్టమని చెప్పాలి. 'బాహుబలి' సినిమాను ఆ స్థాయిలో తెరపై ఆవిష్కరించడం సామాన్యమైన విషయం కాదు. 'బాహుబలి' సినిమాకి ముందు నుంచే ఆయన గొప్ప దర్శకుడు. అయితే 'బాహుబలి' ఆయనను ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పటి నుంచి ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక పెరిగిపోతూ వస్తోంది" అంటూ చెప్పుకొచ్చారు.       
rajamouli
adarsh

More Telugu News