shahid afridi: భారత్ కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన పాక్ క్రికెటర్ అఫ్రిదీ

  • కశ్మీర్ లో అమాయకులను చంపుతున్నారు
  • మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది
  • ఐక్యరాజ్యసమితి ఎందుకు మౌనంగా ఉంటోంది
భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ లో మానవ హక్కులను కాలరాస్తున్నారని, అమాయకులను చంపుతున్నారని మండిపడ్డాడు. స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్న కశ్మీరీల నోళ్లను మూయించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నాడు. భారత్ ఆక్రమిత కశ్మీర్ లో ఇంత హింస చోటు చేసుకుంటున్నా... ఐక్యరాజ్యసమితి కానీ, ఇతర అంతర్జాతీయ సంస్థలు కానీ ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ప్రశ్నించాడు. కశ్మీర్ లో చోటు చేసుకుంటున్న రక్తపాతాన్ని ఆపే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని నిలదీశాడు. 
shahid afridi
India
kashmir
UNO
human rights

More Telugu News