dulipalla narendra: బీజేపీని విమర్శిస్తే వారికంటే విజయసాయిరెడ్డి ఎక్కువగా బాధపడుతున్నారు: ధూళిపాళ్ల

  • వైసీపీ నేతల నటన ముందు ఎస్వీఆర్‌ కూడా సరిపోరు
  • రాష్ట్రాన్ని రావణకాష్టం చేయాలని వైసీపీ కుట్ర
  • విజయ సాయిరెడ్డి ఢిల్లీలో రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు
  • కర్ణాటకకు టీములను పంపాల్సిన అవసరం మాకులేదు
వైసీపీ నాయకుల నటన ముందు ఎస్వీ రంగారావు లాంటి వారు కూడా సరిపోరని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చురకలంటించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని రావణకాష్టం చేయాలని వైసీపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. విజయ సాయిరెడ్డి ఢిల్లీలో రాష్ట్రాన్ని, ప్రజలను తాకట్టుపెట్టారని, ప్రధాని మోదీ అండ చూసుకుని ఆయనకు పొగరు పెరిగిందని ఆరోపించారు.

బీజేపీని విమర్శిస్తే ఆ పార్టీ నేతలకంటే విజయసాయిరెడ్డి ఎక్కువ బాధపడుతున్నారని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అనేక ఆరోపణలు చేసి ఒక్కటీ నిరూపించలేకపోయారని అన్నారు. కర్ణాటకలో బీజేపీని ఓడించడానికి తాము టీములను పంపామని కూడా కొందరు ఆరోపిస్తున్నారని, ఆ అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు.

dulipalla narendra
Telugudesam
BJP

More Telugu News