Guntur District: ఆర్థిక సాయం పేరుతో చెలరేగిన కామాంధుడు!

షార్ట్స్‌లో చూడండి
ఒక కుటుంబం ఆర్థిక దుస్థితిని ఆసరాగా చేసుకున్న కామాంధుడు తల్లీకూతుళ్లని లోబర్చుకోవడమే కాకుండా, కూతురి బిడ్డపై కూడా కన్నేసిన ఘటన గుంటూరు పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. పోలీసులు తెలిపిన ఆ వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన నాగేశ్వరరావు ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వారి ఆర్థిక స్థితిని ఆసరాగా తీసుకుని, వారికి సాయం చేస్తూ, కొన్నాళ్లకు ఆమె కూతురిని కూడా లోబర్చుకున్నాడు.

వారిద్దరితో సహజీవనం చేస్తూనే, భర్తతో విభేదాల కారణంగా పుట్టింటికి చేరిన మనవరాలి (కూతురి కుమార్తె) పై కూడా కన్నేశాడు. కామాంధుడి లైంగిక వేధింపులు తాళలేకపోయిన ఆమె.. తల్లి, అమ్మమ్మకు ఫిర్యాదు చేయగా, వారు కూడా ఆయనకే వత్తాసు పలికారు. దీంతో గుంటూరులో ఉన్న స్నేహితురాలి చెంతకు చేరిన బాధితురాలు, తనగోడు వెళ్లబోసుకుంది. ఆమె ఇచ్చిన ధైర్యంతో నేరుగా గుంటూరు రూరల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిడుగురాళ్ల సీఐని ఎస్పీ ఆదేశించారు.
Go Back to Shorts
Guntur District
piduguralla

More Telugu News