Pawan Kalyan: రేపు, ఎల్లుండి విజయవాడలో పర్యటించనున్న పవన్

  • ప్రత్యేక హోదా పోరు జోరు పెంచిన పవన్
  • 4న వామపక్షాలతో కలిసి ప్రణాళిక
  • 5న ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకావిష్కరణ
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. బుధ, గురువారాల్లో విజయవాడలో ఆయన పర్యటించనున్నారు. 4న వామపక్షాలతో కలిసి హోదా పోరు ప్రణాళికపై సమావేశం నిర్వహించనున్న పవన్, 5న ఏపీ మాజీ సీఎస్ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇప్పటివరకు తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలకు మాత్రమే పరిమితమైన ప్రెసిడెంట్ కమిటీలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న పవన్, అదే రోజు ప్రెసిడెంట్ కమిటీలతో వరుస భేటీలు నిర్వహిస్తారు.
Pawan Kalyan
Vijayawada
Andhra Pradesh

More Telugu News