samantha: రామ్ చరణ్ చాలా సౌమ్యుడు : నటి సమంత

షార్ట్స్‌లో చూడండి
అమెరికాలో విహారయాత్రలో ఉన్న కారణంగా హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన ‘రంగస్థలం’ థ్యాంక్యూ మీట్ కు సమంత హాజరుకాలేకపోయిన విషయం తెలిసిందే. ట్విట్టర్ వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రముఖ నటి సమంత ఆసక్తికర సమాధానాలిచ్చింది. నెటిజిన్లు అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికి సమంత ఇచ్చిన సమాధానాలు..

* మీ జీవితంలో ఉత్తమమైన, మర్చిపోలేని రోజు ఏది?
- నా పెళ్లి రోజు

* అక్కినేని నాగచైతన్య భార్య, నాగార్జున కోడలు, లెజెండ్ ఏఎన్నార్ మనవరాలు..వీటిలో ఏ  విషయానికి మీరు గర్వపడతారు?
- కొంచెం కష్టమైన ప్రశ్నే.. నా భర్తకు భార్యను కావడం

*  మీరు అబ్బాయి అయి ఉంటే, ఏ హీరోయిన్ పై క్రష్ ఉండేది?
- దీపికా పదుకొణే

* రంగస్థలం’లో రామ్ చరణ్ తో మీరు కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
- ది బెస్ట్. చాలా సౌమ్యుడు

* ప్రస్తుత తెలుగు, తమిళ సినిమాల్లో ఏ నటి మిమ్మల్ని బాగా మెప్పించింది?
- సాయిపల్లవి
Go Back to Shorts
samantha
Tollywood
Ramcharan

More Telugu News