Uttam Kumar Reddy: అధికారంలోకి రాగానే.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ
తాము అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, దానం నాగేందర్, పొన్నం ప్రభాకర్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ హయాంలో మహిళా సంఘాలకు అనేక పథకాల ద్వారా రుణాలు వచ్చాయని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తుందని, నిరుద్యోగ భృతి కింద ఆర్థిక సాయం కూడా ఇస్తుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో విఫలమైందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.