Vijay Sai Reddy: విజయ సాయిరెడ్డిపై మండిపడ్డ నారా లోకేశ్‌

  • విజయసాయిరెడ్డి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు
  • ఒక్క ఆరోపణ అయినా నిరూపించగలిగారా?
  • రేపో మాపో జైలుకు వెళ్లే వ్యక్తి విజయసాయిరెడ్డి
  • పీఎంవోలో ఆయనకు తరుచూ ఎలా ప్రవేశం లభిస్తోంది?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని, ఒక్క ఆరోపణ అయినా నిరూపించగలిగారా? అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేపో మాపో జైలుకు వెళ్లే వ్యక్తికి పీఎంవోలో తరుచూ ఎలా ప్రవేశం లభిస్తోందని నిలదీశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని తమ ఎంపీలు రాజ్యసభలో మాట్లాడుతున్నారని, విజయసాయిరెడ్డి మాత్రం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టగానే తొలుత అద్భుతం జరిగిందని విజయసాయిరెడ్డి అన్నారని గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ప్రధాని మోదీని వైసీపీ ఎంపీలు ఎందుకు అడగట్లేదని ప్రశ్నించారు. మోదీ సభకు వస్తే నిలదీయకుండా పరారవుతున్నారు లేక కాళ్ల మీద పడుతున్నారని అన్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని కొందరు అంటున్నారని, ఎంపీలు రాజీనామా చేస్తే ఇంకెవరు పోరాడతారని ఆయన ప్రశ్నించారు.
Vijay Sai Reddy
Nara Lokesh
Telugudesam

More Telugu News