Telangana: ఆ బురదను చంద్రబాబుపై చల్లే ప్రయత్నం చేస్తున్నారు : మంత్రి కాల్వ

షార్ట్స్‌లో చూడండి
బురదగుంటలో ఉన్న విజయసాయిరెడ్డి ఆ బురదను సీఎం చంద్రబాబుపై చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంబంధం లేని వ్యక్తులతో చంద్రబాబుకు లింకులు అంటగడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం విజయ్ మాల్యాకు ఏమైనా లబ్ధి చేకూర్చిందా? అంటూ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు.

చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు, దూషణలు చేసి ప్రధాని మోదీకి దగ్గర కావాలని విజయసాయిరెడ్డి చూస్తున్నారని విమర్శించారు. బీజేపీకి రహస్య మిత్రుడిగా విజయసాయి వ్యవహరిస్తున్నారని, చంద్రబాబుకు అవినీతిని అంటగట్టేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు యత్నించి విఫలమయ్యారని అన్నారు.
Go Back to Shorts
Telangana
minister kalva

More Telugu News