airport: రేణిగుంట విమానాశ్రయంలో 150 మంది ప్రయాణికుల ఆందోళన

షార్ట్స్‌లో చూడండి
చిత్తూరు జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయంలో 150 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తాము ఇప్పటికే ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా, ఇంకా రేణిగుంట విమానాశ్రయంలోనే ఉండాల్సి వస్తోందని మండిపడుతున్నారు. కాగా, రేణిగుంట నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం వచ్చిందని, అందుకే విమానాశ్రయంలో రన్‌ వేపైనే ఆ విమానం నిలిచిపోయిందని అధికారులు చెప్పారు. ఆ విమానానికి మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.  
Go Back to Shorts
airport
airplane
renigunta

More Telugu News