Xiaomi Mi TV 4C: షియోమీ నుంచి 50 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ.. ధర రూ.22,700

  • చైనాలో విడుదల అయినా ఎంఐ టీవీ 4సి
  • త్వరలో భారత మార్కెట్ లోకి
  • ఇప్పటికే 4, 4ఏ, 4ఎస్ సిరీస్ లలో స్మార్ట్ టీవీలు విడుదల
చైనా కంపెనీ షియోమీ ఎంఐ టీవీ 4సి పేరిట 50 ఇంచుల డిస్‌ప్లే సైజ్ గల సరికొత్త 4కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ విడుదల కానున్న ఈ స్మార్ట్ టీవీ ఇప్పటికే ఎంఐ టీవీ సిరీస్ లో 4, 4ఏ, 4ఎస్ మోడళ్లను విడుదల చేసింది. కాగా, ఎంఐ టీవీ 4సి కేవలం రూ.22,700 లకే లభించనుంది.

షియోమీ ఎంఐ టీవీ 4సి ఫీచర్స్ :

  • 50" డిస్‌ప్లే సైజ్ (4K HDR)
  • 178 డిగ్రీల వీక్షణ కోణం
  • ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
  • పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్: 3840 x 2160
  • 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
  • 2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • డ్యుయల్ బ్యాండ్ వైఫై 802.11, బ్లూటూత్ 4.2
  • 3 హెచ్‌డీఎంఐ, 1 ఏవీ, 2 యూఎస్‌బీ, 1 ఈథర్‌నెట్ పోర్టు, హెచ్‌డీఆర్ సపోర్ట్, డాల్బీ ఆడియో డీటీఎస్
Xiaomi Mi TV 4C
smarttv
android
Tech-News
television
China
India

More Telugu News