MS Dhoni: ఐపీఎల్ లో కోహ్లీ, ధోనీ వికెట్లే లక్ష్యం: కుల్దీప్ యాదవ్

  • ఐపీఎల్ లక్ష్యాలు వెల్లడించాలనుకోవడం లేదు
  • కోహ్లీ, ధోనీ వికెట్లు తీయాలి
  • ఐపీఎల్ లో మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది
ఐపీఎల్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీల వికెట్లు తీయడమే లక్ష్యమని భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తెలిపాడు. ఐపీఎల్ కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో... ఐపీఎల్ లక్ష్యాల గురించి బయటకు చెప్పదల్చుకోలేదని అన్నాడు.

అయితే స్పిన్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే ధోనీ, కోహ్లీల వికెట్లు తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. ఐపీఎల్ లో మాత్రమే వారి వికెట్లు తీసే అవకాశం దక్కుతుందని చెప్పిన కుల్దీప్ యాదవ్, ఈ అవకాశాన్ని జారవిడుచుకోనని చెప్పాడు. కాగా, ఏప్రిల్ 7న కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ, కుల్దీప్ ఎదురుపడనున్నారు. 
MS Dhoni
Virat Kohli
kuldeep yadav
Cricket

More Telugu News