Lok Sabha: వెల్ లోకి దూసుకెళ్లిన అన్నాడీఎంకే ఎంపీలు.. లోక్ సభను వాయిదా వేసిన స్పీకర్!

  • అన్నాడీఎంకే ఎంపీల ఆందోళన 
  • ఎంపీలను లెక్కించలేకపోతున్నానన్న స్పీకర్
  • సభ ఆర్డర్ లో లేదంటూ వాయిదా
వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్ సభలో యథాప్రకారం ప్రతిష్టంభన కొనసాగింది. సభ మొదలు కాగానే అన్నాడీఎంకే ఎంపీలు వెల్ లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలని వారు నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదే సమయంలో వివిధ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ చదవి వినిపించారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ, సభ్యులంతా తమతమ సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని కోరారు. ఆందోళన నేపథ్యంలో, అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్న ఎంపీలను లెక్కించలేక పోతున్నానని ఆమె చెప్పారు. సభ ఆర్డర్ లో లేనందువల్ల రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
Lok Sabha
sumitra mahajan
no confidence motion

More Telugu News