గంగోత్రికి తెగిన సంబంధాలు... కుప్పకూలిన పొడవైన వంతెన
- భారీ లోడ్ ట్రక్ రావడంతో కూలిపోయిన ఉక్కు వంతెన
- ఏప్రిల్ 18 నుంచి మొదలయ్యే చార్ ధామ్ యాత్రకు ఆటంకాలు
- ప్రత్యామ్నాయ మార్గంపై అధికారుల దృష్టి
మూడు నెలల క్రితం ఇలాగే వంతెన కూలిపోవడంతో కొత్తది నిర్మించారు. 18 టన్నుల బరువును మాత్రమే మోయగలదు. ఓ భారీ ట్రక్కు నిండా ఇసుకను నింపుకుని దాటే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆ లోడ్ ను తట్టుకోలేక వంతెన కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఏప్రిల్ 18 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుండగా, ఈ వంతెన కూలిపోవడంతో యాత్రకు ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే అధికారులు యాత్ర కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు.