charan: చిట్టిబాబును కొత్తగా చూపిస్తాను .. 'రంగస్థలం' సీక్వెల్ గురించి సుకుమార్

షార్ట్స్‌లో చూడండి
'రంగస్థలం' విడుదల రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. చరణ్ ఇంతవరకూ చేసిన సినిమాలకి ఇది భిన్నమని ప్రేక్షకులు అంటున్నారు. సుకుమార్ ఇంతవరకూ చేసిన సినిమాల్లో ఇది ప్రత్యేకమని చెబుతున్నారు. 'చిట్టిబాబు' పాత్రలో చరణ్ జీవించాడనీ, తెరపై ఈ పాత్ర తప్ప చరణ్ కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాత్రను సుకుమార్ తీర్చిదిద్దిన తీరు అపూర్వమని కితాబునిస్తున్నారు.

 తాజాగా ఈ సినిమా గురించి సుకుమార్ మాట్లాడుతూ .. జనానికి ఇంతగా దగ్గరైన చిట్టిబాబు పాత్రను ఇంతటితోనే వదిలేయదలచుకోలేదని చెప్పాడు. ఈ పాత్రను కొనసాగించే ఆలోచన చేస్తున్నానంటూ సీక్వెల్ గురించిన ఆలోచనను బయటపెట్టాడు. సీక్వెల్ చేస్తే అందులో చిట్టిబాబును కొత్తగా చూపిస్తాననీ, చెవికి ఆపరేషన్ చేయించుకుని మాటలు వినగలిగే చిట్టిబాబును చూస్తారని చెప్పాడు. మరి ఈ సినిమా సీక్వెల్ కి చరణ్ ఏమంటాడో .. అదెప్పుడు కార్యరూపాన్ని దాలుస్తుందో చూడాలి.     
Go Back to Shorts
charan
saanta

More Telugu News