ntr: రెండు భాగాలుగా మహానటుడు 'ఎన్టీఆర్' మూవీ?

  • 'ఎన్టీఆర్' మూవీపై అభిమానుల్లో ఆసక్తి 
  • రెండు గంటల నిడివి చాలదనే అభిప్రాయాలు 
  • అదే ఆలోచనలో దర్శక నిర్మాతలు  
అతిరథ మహారథుల సమక్షంలో ఇటీవలే 'ఎన్టీఆర్' సినిమాను లాంచ్ చేశారు. నటుడిగాను .. రాజకీయపరంగాను ఎన్టీఆర్ జీవితం ఎన్నో అనూహ్యమైన మలుపులు తిరిగింది. ఈ రెండు రంగాల్లోనూ ఎంతోమంది మహామహులను కలుపుకుంటూ ఆయన ముందుకెళ్లారు. అందువలన ఆయన జీవితచరిత్రను రెండు గంటల్లో సంతృప్తికరంగా చెప్పడం సాధ్యం కాకపోవచ్చని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.

 ఈ సినిమా లాంచింగ్ రోజున ఇదే విషయాన్ని దర్శకుడు తేజ వ్యక్తం చేశాడు. ఎన్టీఆర్ సినిమాను 2 గంటల్లో చేయడం కష్టమనీ, కనీసం 6 గంటల నిడివైనా కావాలని ఆయన అన్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను రెండు భాగాలుగా చేసే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథానాయకుడిగా ఎన్టీఆర్ కెరియర్ ను గురించి చెప్పడానికే రెండు గంటల సమయం చాలదనే మాట అభిమానుల వైపు నుంచి కూడా బలంగానే వినిపిస్తోంది.        
ntr
Balakrishna

More Telugu News