Narendra Modi: సహజ సిద్ధ మానవ స్పందనలు మోదీకి లేవు : వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి.నరసింహారావు

  • తల్లి, అన్న, చెల్లి..ఇలా ఎవరిపైనా మోదీకి ప్రేమలేదు
  • మోదీ అంటే యశోదాబెన్ కు ఎనలేని ప్రేమ
  • ఎవరి పట్ల ఎలాంటి అనుబంధం లేని వ్యక్తి ఆయన
  • ఇతరుల లోపాలు గుర్తించడం మోదీ అవలక్షణం
ప్రధాని నరేంద్ర మోదీకి  సహజ సిద్ధ మావన స్పందనలు లేవని, మానవ స్పందనలు లేకపోవడం వ్యక్తిత్వ లోపమని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి.నరసింహారావు అన్నారు.

 ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘మిగతా వాళ్ల కంటే భిన్నంగా ఉండాలన్న భావన మోదీలో చిన్నప్పటి నుంచి ఉంది. ఆర్ఎస్ఎస్ లో పని చేయాలని ఆయన చిన్నప్పుడే నిర్ణయించుకున్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి పీఎం స్థాయికి మోదీ ఎదిగారు. ఏ వ్యక్తీ అన్ని పనులు సంపూర్ణంగా చేయలేరు. మోదీకి ఏ పరిజ్ఞానమూ లేదు, ఏ పనీ చేయలేరు. మోదీ మంత్రి వర్గంలో ఒక్క సమర్థుడూ లేరు. మోదీ అంటే యశోదాబెన్ కు ఎనలేని ప్రేమ. మోదీ పేపర్ కటింగ్స్ అన్నీ సేకరించి ఆమె దాచిపెట్టుకుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి దయనీయంగా ఉంది.

తల్లి, అన్న, చెల్లి.. ఇలా ఎవరిపైనా మోదీకి ప్రేమలేదు. తల్లిని ఆమె పుట్టినరోజు నాడే ఆయన కలుస్తారు. ప్రజల ఇబ్బందులు మోదీకి పట్టడం లేదు. ఎవరి పట్ల ఎలాంటి అనుబంధం లేని వ్యక్తి ఆయన. తనకు మిత్రులెవరూ లేరని మోదీనే చెప్పారు! దేశం పట్ల అంకితభావంతో పనిచేసేది తానొక్కడినేనని మోదీ అనుకుంటారు! ప్రతి ఒక్కరినీ ఆయన తక్కువగానే చూస్తారు! సన్నిహితులైన వాఘేలా, తొగాడియాను మోదీ దూరం చేసుకున్నారు.

ఇతరుల లోపాలు గుర్తించడం మోదీ అవలక్షణం. అందరూ స్వార్థపరులేనన్నది ఆయన అభిప్రాయం. తన కన్నా పెద్దవాళ్లను, ఆదరించిన వాళ్లను మోదీ పట్టించుకోరు. మోదీకి అమిత్ షా చక్కని అనుచరుడు. మోదీ మనసులో ఉన్నది ఆయన చేస్తారు. మోదీకి, అమిత్ షాకు ఎలాంటి అనుబంధం లేదు. హిందూమతం పట్ల మోదీకి ఎటువంటి ప్రేమలేదు.. ఆ మతాన్ని వాడుకుంటున్నారు. అహ్మదాబాద్ లో వంద ఆలయాలు కూలగొట్టించారు. ఆ ఆలయాలను ఎందుకు కూలగొట్టారని ప్రశ్నించింనందుకు ప్రవీణ్ తొగాడియాను జైల్లో పెట్టించారు’ అంటూ ఆయన విశ్లేషించారు.
Narendra Modi

More Telugu News