Anchor Syamala: అగౌరవంగా ఉండే 'పటాస్' వంటి షోలు నేను చేయను, చేయలేను: యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్య

  • గోదావరి ప్రజలకు అలవాటైన పదాలు వాడకుండా మాట్లాడలేను
  • ఇతరులను గౌరవించకుండా మాట్లాడటం రాదు
  • కేవలం చూసి ఎంజాయ్ చేస్తానంతే: శ్యామల
'పటాస్' వంటి టీవీ షోస్ ను తాను చేయలేనని యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇస్తూ, అటువంటి షోస్ గోదావరి జిల్లాలకు చెందిన తనకు పడవని, ఇదే సమయంలో వాటిని చూసి తాను ఎంజాయ్ చేస్తానని చెప్పింది. ఇతరులను గౌరవించకుండా పిలవడం తనకు చేతకాదని, గోదావరి ప్రజలకు అలవాటైన 'అండి', 'గారు' వంటి పదాలు వాడకుండా తాను మాట్లాడలేనని చెప్పింది.

అందువల్ల అటువంటి షోస్ తాను చేయలేనని చెప్పుకొచ్చింది. ఒరేయ్, వాడు, నీ యంకమ్మ వంటి మాటలను మాట్లాడలేనని చెప్పింది. కొన్ని ఆడియో ఫంక్షన్లలో తాను ధరించిన దుస్తులపై వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ, వేసుకునే దుస్తులపై నిర్ణయం తానే తీసుకుంటానని, మరెవరి ప్రమేయం ఉండదని శ్యామల వెల్లడించింది. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం చాలెంజ్ గా అనిపిస్తుందని తెలిపింది. శ్యామల ఇంటర్వ్యూను మీరూ చూడండి.
Anchor Syamala
Patas
East Godavari District
West Godavari District

More Telugu News