Ranveer Singh: ఐపీఎల్ ప్రారంభోత్సవంలో రణ్‌వీర్ పాల్గొంటాడో? లేదో? డౌటే....!

  • ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ గాయపడిన రణ్‌వీర్
  • నెల రోజుల పాటు పెద్దగా కష్టించవద్దని వైద్యుల సలహా
  • ఈ నెల 7న జరిగే ఐపీఎల్ ప్రారంభోత్సవంలో పాల్గొనడంపై సస్పెన్స్
ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా భుజానికి గాయమైన బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఈ నెల 7న జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా టోర్నీ ప్రారంభోత్సవంలో అభిమానులను అలరిస్తాడా? లేదా? అన్నది సందేహంగా మారింది. గాయపడినప్పటికీ, రణ్ వీర్ ప్రస్తుతం తాను నటిస్తున్న 'గల్లీ బాయ్' సినిమా షూటింగ్‌కు షెడ్యూల్ ప్రకారం, యథావిధిగా హాజరై తన ప్రొఫెషనలిజాన్ని చాటాడు.

నెల రోజుల పాటు భుజంపై పెద్దగా ఒత్తిడి కలిగించవద్దంటూ అతనికి డాక్టర్ సలహా ఇచ్చినట్లు అతని ప్రతినిధి తెలిపారు. ఇదే విషయమై రణ్‌వీర్ ప్రస్తుతం వైద్యుల సలహా తీసుకుంటున్నారని, ఒకటి రెండు రోజుల్లో దీనిపై ఓ ప్రకటన చేస్తామని ఆయన చెప్పారు. కాగా, ఐపీఎల్ ప్రారంభోత్సవంలో రణ్‌వీర్ సహా వరుణ్ ధావన్, ముద్దుగుమ్మలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పరిణీతి చోప్రా కూడా అదిరిపోయే ప్రదర్శన ఇవ్వడానికి రిహార్సల్స్ చేస్తూ బిజీబిజీగా ఉన్నట్లు సమాచారం.
Ranveer Singh
Parineeti Chopra
Varun Dhavan
IPL

More Telugu News