Monkey: 16 రోజుల శిశువును ఎత్తుకెళ్లిన కోతి.. అడవిలో పెద్ద ఎత్తున గాలింపు చేపట్టిన అధికారులు

  • తండ్రి ఒడిలో నిద్రిస్తున్న శిశువుతో వానరం పరారీ
  • అడవిలో విస్తృతంగా గాలిస్తున్న అటవీ, అగ్నిమాపక సిబ్బంది
  • దొరకని ఆచూకీ.. ఆందోళనలో తల్లిదండ్రులు
కటక్‌లో ఘోరం జరిగింది. తండ్రి ఒడిలో నిద్రిస్తున్న 16 రోజుల నవజాత శిశువును ఓ వానరం ఎత్తుకెళ్లింది. కటక్ జిల్లాలోని బంకి బ్లాక్‌లోని తలబస్తా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోతి ఎత్తుకెళ్లిన చిన్నారి కోసం అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఆపరేషన్ చేపట్టారు. పెద్ద ఎత్తున గాలిస్తున్నా ఇప్పటి వరకు శిశువు ఆచూకీ లభ్యం కాకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.

అటవీ అధికారుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రామకృష్ణ నాయక్ తన ఇంటి వరండాలో 16 రోజుల బాబుతో నిద్రిస్తుండగా తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో అకస్మాత్తుగా వచ్చిన వానరం శిశువును తీసుకుని వెళ్లిపోయింది. ఇంటి పని చేసుకుంటున్న నాయక్ భార్య తన కుమారుడిని కోతి ఎత్తుకుపోతుండడాన్ని చూసి అదిలించే లోపే అక్కడి నుంచి పరారైంది. వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించడంతో అందరూ కలిసి వెతికేందుకు అడవిలోకి వెళ్లారు. సమాచారం అందుకున్న అధికారులు కూడా గాలిస్తున్నారు.
Monkey
snatch
infant
Cuttack

More Telugu News