Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పులు

  • కేంద్ర ప్రభుత్వంపై పోరాటం
  • వచ్చేనెల 3, 4 తేదీల్లో ఢిల్లీ పర్యటన
  • పలు పార్టీల నేతలతో చర్చలు
ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయంపై పోరాటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా వచ్చేనెల 2,3 తేదీల్లో ఢిల్లీలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకోగా, ఇప్పుడు 3, 4 తేదీల్లో ఢిల్లీలో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఢిల్లీలో వివిధ పార్టీల మద్దతు కూడగట్టడమే అజెండాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉండనుంది. విభజన హామీలను పక్కనబెట్టి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని చంద్రబాబు పలు పార్టీలకు వివరించనున్నారు.
Chandrababu
New Delhi
Andhra Pradesh

More Telugu News