Botsa Satyanarayana: అందుకే, మా ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడ్డారు: వైసీపీ నేత బొత్స సత్యనారాయణ

  • రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకుంటాం 
  • కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం
  • మిగిలిన పార్టీలతో సంప్రదింపులు జరిపాం
  • టీడీపీ తప్పనిసరి పరిస్థితుల్లో మా దారిలోకి వచ్చింది
రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే తమ పార్టీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడ్డారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. లోక్‌సభలో ప్రస్తుతం తమ సభ్యులు ఐదుగురే ఉన్నప్పటికీ తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని అన్నారు. తాము మిగిలిన పార్టీలతో సంప్రదింపులు జరిపామని, అవిశ్వాస తీర్మానానికి బలం చేకూర్చామని చెప్పారు.

ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకూ తాము పోరాటం చేస్తామని అన్నారు. ఏపీ మంత్రులు చేస్తోన్న వ్యాఖ్యలు చూస్తుంటే వారు సహనం కోల్పోయినట్లుగా అనిపిస్తోందని, వారిని ఏమనాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తాము అవిశ్వాస తీర్మానం పెట్టాక, టీడీపీ తప్పనిసరి పరిస్థితుల్లో తమ దారిలోకి వచ్చిందని, ఆ పార్టీ కూడా అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తోందని అన్నారు. టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే తమతో రావాలని ఏపీలోని అందరు ఎంపీలతో రాజీనామాలు చేయిద్దామని అన్నారు.
Botsa Satyanarayana
YSRCP
Special Category Status

More Telugu News