Prakash Raj: క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ప్ర‌కాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌ర్ణాట‌క‌లో బీజేపీ గెలుస్తుందా? లేదా? అన్న విష‌యాన్ని కొన్ని రోజుల్లో మీరే చూస్తార‌ని సినీన‌టుడు ప్ర‌కాశ్ రాజ్ మీడియాతో అన్నారు. క‌ర్ణాటకవాసులు ఎంతో సహనంతో ఉంటారని, వారిని ఏ హిందుత్వ పార్టీలు విడగొట్టలేవని వ్యాఖ్యానించారు. మతం పేరుతో ప్రచారం చేస్తున్న వారిని ఆ రాష్ట్ర ప్రజలు అంగీక‌రించ‌బోర‌ని బీజేపీని విమ‌ర్శించారు.

తాజాగా, ఓ జాతీయ టీవీ ఛానెల్ నిర్వ‌హించిన చ‌ర్చ‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.... కర్ణాటక వాసులు అందరితో కలిసి జీవిస్తార‌ని, అందరిని ఆదరిస్తార‌ని, సామరస్యంగా ఉంటార‌ని చెప్పారు. ఆ రాష్ట్రంలో బహుళ సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ ఏడాది మే 12న ఒకే దశలో జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు మే15న వెలువడతాయి.  
Go Back to Shorts
Prakash Raj
Karnataka
hindu

More Telugu News