somu veerraju: టీడీపీ వల్ల చిత్రహింసలు అనుభవించాం: సోము వీర్రాజు

  • ఇంకొంత కాలం టీడీపీతో ఉంటే.. ఆత్మహత్యే శరణ్యం అయి ఉండేది
  • కడప ఉక్కు కర్మాగారంపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
  • కేంద్ర నిధులతో ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలి
తెలుగుదేశం పార్టీ మద్దతు వల్ల తాము చిత్రహింసలను అనుభవించామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఇంకొంత కాలం టీడీపీ మద్దతు కొనసాగి ఉంటే... తమకు ఆత్మహత్యే శరణ్యం అయి ఉండేదని చెప్పారు. రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని తెలిపారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర నిధులతోనే పూర్తి చేస్తామని టీడీపీ నేతలు అంటున్నారని... పెండింగ్ లో ఉన్న ఇతర ప్రాజెక్టులను కూడా రాష్ట్ర నిధులతోనే పూర్తి చేయాలని అన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులతో ఎలాంటి అభివృద్ధి చేశారో చూపించాలని డిమాండ్ చేశారు. 
somu veerraju
polavaram
Chandrababu
Telugudesam

More Telugu News