Kajal Agarwal: నా గ్లామర్ సీక్రెట్ అదే....: కాజల్ అగర్వాల్

  • మంచి ఆహారం, నిద్ర, కష్టపడి పనిచేయడం, హ్యాపీగా ఉండటం నా గ్లామర్‌కి కారణం
  • శ్రీదేవి అంటే చాలా ఇష్టం
  • చిరంజీవితో పనిచేయడం సరదాగా అనిపించింది
'ఎంఎల్ఏ' సినిమా హిట్‌తో హ్యాపీ మూడ్‌లో ఉన్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన గ్లామర్ సీక్రెట్ గురించి తెలిపింది. ఆరోగ్యవంతమైన ఆహారం, మంచినిద్ర, కష్టపడి పనిచేయడం, ఎప్పుడూ హ్యాపీగా ఉండటం...ఇంతకాలం తాను గ్లామర్‌గా ఉండటానికి ఇదే తారకమంత్రమని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఓ న్యూస్ ఛానల్ చిట్‌చాట్‌లో కాజల్ తన గ్లామర్ రహస్యంతో పాటు పలు విషయాలపై స్మార్ట్‌గా మాట్లాడింది. ఓ నటిగా అతిలోకసుందరి శ్రీదేవి అంటే తనకెంతో ఇష్టమని తెలిపింది. శ్రీదేవి చాలా అందమైన మహిళ అంటూ పొగిడింది.

 టాలీవుడ్, కోలీవుడ్ రెండూ తనకు సొంతిళ్లు వంటివని చెప్పింది. డైరెక్టర్లందరితోనూ తనకు మంచి సంబంధాలున్నాయని, ఎవరితోనూ ఇబ్బందులు లేవని తెలిపింది. 'ఖైదీ నెంబరు 150' సినిమా గురించి మాట్లాడుతూ...మెగాస్టార్ చిరంజీవితో పనిచేయడం చాలా సరదాగా అనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది. ప్రేమ విషయానికొచ్చేసరికి మరింత తెలివైన సమాధానమిచ్చింది. ఇప్పటివరకు ఎవరినైనా ప్రేమించారా? అని అడిగితే, 'ప్రస్తుతానికి నాకు అంత సమయం లేదండీ..!' అంటూ నవ్వేసింది. ఆమె ఇటీవల నటించిన 'ఎంఎల్ఏ' చిత్రం సక్సెస్‌ఫుల్ టాక్‌ తెచ్చుకుంది. 
Kajal Agarwal
MLA
Hayyp

More Telugu News